నేనంటే ఎంతిష్టం అని నేను నిన్ను అడిగినప్పుడల్లా నా గుండెలో మోగే తీయని అలజడి...
ఎలా చూపను...
అదుగో చూడు ఆ వినీలాకాశం పరుచుకున్న చోటంత ఇష్టం...
ఇలా చూడు ఈ వెన్నెల పూలు రాలే రేయంత ఇష్టం...
గల గల మని పరవళ్ళు తోక్కే సెలయేరు చేసే సవ్వడంత ఇష్టం...
మంచు మీటిన సన్నజాజి పువ్వులంత ఇష్టం...
వాన ముద్దుల వేడి ఊపిరి తాకుతుంటే పరవశించే వసుధ కన్నుల వలపంత ఇష్టం...
అని నువ్వు చెప్పాలని... అది నేను వినాలని...
ఎగసి పడే నా ప్రతి అడుగుని ఆపాలనే నా ప్రయత్నంలో ఎప్పుడూ నేను ఓడిపోయి..
నిన్నే తలచి తలచి నీ ముందు నిలిచి వేచి ఉన్న నా అల్లరి మనసుని నీకు ఎలా చూపను...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి