14, సెప్టెంబర్ 2013, శనివారం

నేను ఒప్పుకోలేను

నేను పువ్వులానే ఉన్నా.. పరిమళమే లేదు
నేను మెరుపులానే ఉన్నా.. చురుకుదనమే లేదు
నేను వెన్నెలలానే ఉన్నా.. చల్లదనమే లేదు
నేను పాటలానే ఉన్నా.. భావమే లేదు
నేను సుధలానే ఉన్నా.. తీయదనమే లేదు
నేను శ్వాసలానే ఉన్నా.. వెచ్చదనమే లేదు
నేను ప్రేమలానే ఉన్నా.. పరవశమే లేదు
నేను నేనుగానే ఉన్నా.. నువ్వే లేవు
ఇలా ఉన్న నన్ను నేను ఒప్పుకోలేను

ఆలోచించకు

మాట్లాడేముందు ఒక క్షణం ఆలోచించు,,
మాట అనే ముందు ఒక నిమిషం ఆలోచించు..
రహస్యం చెప్పే ముందు ఒక గంట ఆలోచించు..
నిర్ణయం తీసుకునే ముందు ఒక రోజు ఆలోచించు..
కానీ పశ్చాత్తాపపడడానికి ఏ మాత్రం ఆలోచించకు..

స్వాగతించు హృదయమా

నిను తాకిన గాలి సోకి పూలు పూచిన తోటలో ..
తిరుగాడే నా మనసు హాయి చెప్పతరమా..
నిను చూసిన నా కనుల కొలనులలో..
పూస్తున్న సిగ్గు పూలు దాచతరమా..
నీ వెంట నడవాలని నీ వశమైన తలపులలో..
తపనలను తళుకుమనక ఆపతరమా..
నిను చేరుతున్న చిలిపి వలపు పిలుపులలో..
ఊయలూగు ఆశలను స్వాగతించు హృదయమా..

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఆఖరి కోరిక తీరేదెలా

పరిచిన నా గుండెలో గుచ్చేలా వినిపించే నీ మాటే చాలు నా ప్రాణం పోయిందే..
పువ్వుల రేకుల మెత్తని గుండెకు సవ్వడిగా నే మారాననుకున్నా..
వెచ్చని స్పర్శల వెన్నెల వాకిట్లో ఊపిరి ఊయల ఊగాననుకున్నా...
ప్రాణం లేని ప్రేమగా మిగిల్చావే..  సర్వం నీవై మిగిలా కానరావే..
ఏమైనాయో నిన్నటి కౌగిళ్ళు.. వలపంతా వాడిన వెన్నెలౌతుంటే..
ఏమౌతాయో రేపటి నా కళ్ళు.. రేయంతా ఆగని కన్నీరౌతుంటే..
తెలవారి ఈ రేయి నా ప్రాణం తీయందే.. ఈ ఎద కోత ఆపేదెలా..
నిను చేరి మనసారా నా ప్రేమ చూపందే ఆఖరి కోరిక తీరేదెలా..