7, జనవరి 2016, గురువారం

తేనెలూరుతుందా...

కనుల చాటు నీరు తేనెలూరుతుందా..
నువ్వు లేక నా మనసు ఆగుతుందా.. 
మౌనమన్న మాటకే పలుకు ఉండగా.. 
మౌనానికి అద్దంలా నువ్వు మారగా..
పేరులోని భావం పేరుకు తెలియదుగా..
భావమే లేని పేరు లేనే లేదుగా..
పిలువకుంటే నువ్వు అడుగు సాగదుగా..
పలుకని నువ్వు నా పిలుపు వినవుగా.. 
మరి కనుల చాటు నీరు ఆగుతుందా.. 
తేనెలూరుతుందా...


5, జనవరి 2016, మంగళవారం

గగనానికి నువ్వు చూడగలవని అంతం ఉందా

చూపులు తాకే వరకే లోకం అనుకుంటే అడుగు సాగునా
చీకటి వెనుక రేపటి వెలుగు లేదంటే నిదుర చేరునా
మనసుకు చేరే ప్రతి వ్యధకు తెలుసు అదుగో దూరంగా నిలుచుంది ఎంతో ఆనందం
తలపును తడిమే ప్రతి కలకు తెలుసు ఇదుగో ఇక్కడే చూపించాలి కాస్త వివేకం
అసలెందుకు, కనులు మూసి చూడవా ఈ లోకం నీ సంకల్పంతో
మరెందుకు, మనసును తట్టి చూపవా ఆ ఆనందం నీ ఆలోచనలతో
సంద్రానికి నువ్వు చూడని ఆవల ఒడ్డు లేదా
గగనానికి నువ్వు చూడగలవని అంతం ఉందా