పేరు లేని నిన్ను నేనెలా పిలుస్తానని నవ్వుకుంటున్నావు...
కనిపించనని నువ్వు అనుకున్నా, కనిపించవని ఎవరన్నా
నమ్మలేకున్నాను...
ప్రతి క్షణం వినిపిస్తూ, స్పర్శిస్తూ, అనుభూతిలో మునకేస్తూ...
కాలం తాకని ఓ నిరాకారీ...
చూస్తున్నాగా కనులు మూసినా మరి లేనిది ఎక్కడ
కలవరిస్తున్నాగా ప్రతి శ్వాసతో మరి మౌనం ఎక్కడ
దూరం, పయనం లేవని అనుకున్నా
పేరు, పిలుపు అక్కరలేదన్నా
ఏమన్నా నాతో నేను, నాలో నేను లిపి లేకనే చెబుతున్నట్టేగా...
కంటున్నా ఇలలోవన్నీ కలలాగా మరి నువ్వు కనిపిస్తున్నట్టేగా...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి