మాటకు మౌనం భాషైనప్పుడు, శ్వాసని తాకే చల్లని గాలి వెన్నెల వర్షం కురిపిస్తుంటే
నువ్వేనా ఆ తిమ్మెరలో తడబడు నా పెదవులు తాకినది..
కనులకు, కాలం తెలియని కబురుల వెనుకే పరుగిడుతుంటే, మైమరిచి ఉంటే
నీదేనా ఆ అలికిడి త్వరపడి నా మనసుకు చేరినది..
ఎప్పటిదో ఈ నిమిషం నే వేచి ఉన్నది..
ఇప్పటికీ ఆ సమయం నను చేరకున్నది..
తరిమే స్వరమై దూరమైన దరి చేరడానికి నిదురైన పోవు నా కనులు..
సాగే నదిలా ఆగని పయనం చేయడానికి పురివిప్పుకోవు నా కలలు..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి