- ఒక మనిషిని బలవంతపెట్టి లేదా వారి బలహీనతను అడ్డుగా పెట్టి చేయించిన పని యొక్క ఫలితం ఎప్పుడూ సరిగా ఉండదు.
- అడిగితే లోకువ అయిపోతాను అనే ఒకే ఒక్క విషయం మనిషిని గమ్యం చేరే మార్గానికి ఆలస్యం చేస్తూ ఉంటుంది.
- ప్రతి బుద్ధికి తెలిసే ప్రపంచం ఆయా బుద్ధి యొక్క దృష్టికోణమే.
- మనిషి మాట్లాడే చాలా మాటలు తను వినేటపుడు కానీ, చదివేటపుడు కానీ ఇష్టపడడు.
- చేరుకున్న గమ్యం కన్నా చేరడానికి వచ్చిన దారి ముఖ్యం, చేసిన పని కన్నా దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశం ముఖ్యం, వేయి వేల మాటల కన్నా సరైన సమయంలో మౌనం ముఖ్యం.
- మెప్పును తేనె లాగ తాగే మనిషి తన ప్రజ్ఞపై ప్రశ్నకి చెదిరిపోయి చిన్నబోతాడు, తనంతవాఁడు లేడు అంటే ఉప్పొంగిపోయే మనిషి "నువ్వు ఎవరు" అని అడిగితే ఉక్కిరి బిక్కిరి అవుతాడు.
4, జులై 2017, మంగళవారం
చిన్ని సిరిమువ్వలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి