కనుల చాటు నీరు తేనెలూరుతుందా..
నువ్వు లేక నా మనసు ఆగుతుందా..
మౌనమన్న మాటకే పలుకు ఉండగా..
మౌనానికి అద్దంలా నువ్వు మారగా..
పేరులోని భావం పేరుకు తెలియదుగా..
భావమే లేని పేరు లేనే లేదుగా..
పిలువకుంటే నువ్వు అడుగు సాగదుగా..
పలుకని నువ్వు నా పిలుపు వినవుగా..
పేరులోని భావం పేరుకు తెలియదుగా..
భావమే లేని పేరు లేనే లేదుగా..
పిలువకుంటే నువ్వు అడుగు సాగదుగా..
పలుకని నువ్వు నా పిలుపు వినవుగా..
మరి కనుల చాటు నీరు ఆగుతుందా..
తేనెలూరుతుందా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి